ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా.. ఇతర హీరోల అభిమానులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కరోనా సమయంలో , ఆ తర్వాత కూడా తమ సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ అభిమానులు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇదంతా ఎక్కువగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నే జరుగుతున్న సేవా కార్యక్రమం అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కార్యక్రమం అరుదైన రికార్డు దక్కించుకుంది. వాటి గురించి చూద్దాం.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 రోజులుగా అన్నదానం జరుగుతూనే ఉన్నదట. మొదట హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో మాత్రమే జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఏకంగా ఐదు రాష్ట్రాలకు విస్తరించేలా చేస్తున్నారు. మొత్తం 113 లొకేషన్లలో.. ఎన్టీఆర్ అభిమానులు 600 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న కొంతమంది పేదవారికి భోజనం పెడితే వారి యొక్క సేవ గుణం చాటుకుంటున్నారు. తమ అభిమాన హీరో గర్వపడేలా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల నంటూ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటూ ఇతర హీరోల పట్ల ఇతర అభిమానుల పట్ల.. విమర్శలు చేయకుండా ఒక చారిటీ ట్రస్టును ఏర్పరిచి ప్రతిరోజు కొంత మంది ఆకలి తీరుస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.ఇక వీరి పని నీ సోషల్ మీడియాలో కొందరు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ చారిటీ కార్యక్రమం ఆదర్శంగా నిలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అభిమాన హీరోల పేరు చెప్పుకొని పాలాభిషేకాలు చేయడం కాదు లక్షలు ఖర్చు చేసి ఫ్లెక్సీలు, పూల హారాలు వేయడం కాదు ఆకలితో ఉన్న వారికి కాస్త అన్నం పెట్టడం అనేది ఇది నిజంగా అభినందనీయం కార్యక్రమ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రాల విషయానికి వస్తే ..RRR సినిమా కథ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఒక చిత్రానికి సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: