తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ నయనతారకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంన దని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె తనకు తగిన పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. అందుచేతనే ఈమెను లేడీ సూపర్ స్టార్ గా పిలుస్తూ ఉంటారు ఆమె అభిమానులు. నయనతార అవకాశం దొరికినప్పుడల్లా హీరోయిన్ గా మూవీస్ లోనే ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వచ్చిన సినిమాలే అనామిక, కర్తవ్యం ఈ సినిమాలో నయనతార నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈమె నటన తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నయనతార. డైరెక్టర్ జి ఎస్ వెంకటేష్ దర్శకత్వంలో వస్తున్న ఓ -2 సినిమా లో నటిస్తున్నది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా టీజర్ చుస్తే ఈ చిత్రం పై  మరింత ఆసక్తి నెలకొనేలా కనిపిస్తోంది. నయనతారతో పాటుగా కొంతమంది వ్యక్తులు ప్రయాణిస్తున్న ఒక బస్సులో అనుకోకుండా ఆ బస్సు లోయలో పడి పోతుంది.

బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయి లోపల ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండడంతో బస్సులో ఉన్న వారంతా కేవలం 12 గంటలు మాత్రమే బతుకుతారనే విధంగా టీజర్ లో చూపించడం జరిగింది. మరి ఆ తర్వాత వీరు ఇ పరిస్థితుల్లో నుంచి బయట పడతారు.. ఎలా బయట పడతారో అనే ఈ విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక నయనతార కూడా ఎప్పటిలాగే సినిమాలో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా టీజర్ కు హైలెట్ గా నిలుస్తోంది. ఈ చిత్రం డైరెక్టుగా ఓటీటీ లోనే డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: