‘కేజీ ఎఫ్ 2’ ఘనవిజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగిపోతోంది. దీనితో ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సలార్’ మూవీతో ప్రభాస్ దశ తిరుగుతుందని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సలార్’ మూవీ షూటింగ్ ను జూన్ నెలలో ప్రారంభించి ఈసంవత్సరాంతానికి పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు.


అయితే ఇలా ఈమూవీ షూటింగ్ పరుగులు తీయడానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు ఒక కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ప్రభాస్ భుజానికి ఆపరేషన్ జరగడంతో డాక్టర్ సలహామేరకు సుమారు 6 వారాల నుండి రెస్ట్ లో ఉన్నాడు. స్వతహాగానే లావుగా ఉండే ప్రభాస్ ఈమధ్య తనకు దొరికిన రెస్ట్ పిరియడ్ లో మరింత లావు అయినట్లు సమాచారం.


ఈమధ్య కాలంలో ప్రభాస్ లుక్ పై విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఈమధ్య ప్రభాస్ ను చూసిన కొంతమంది శ్రీరాముడు ఇంత లావుగా అయిపోయాడు అంటూ సెటైర్లు వేసారు. ఇప్పుడు ఈకామేన్త్స్ అన్నీ ప్రశాంత్ నీల్ దృష్టి వరకు వచ్చినట్లు ఉన్నాయి. ఈమధ్య ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి కనీసం 4 వారాలు కేవలం లిక్వీడ్స్ తీసుకుంటూ ప్రభాస్ ను తన ఫిజిక్ ను మార్చుకోమని అలా మార్చుకున్న వెంటనే ‘సలార్’ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టి ఆతరువాత తన ‘కేజీ ఎఫ్ 3’ వైపు వెళ్ళిపోతాను అని స్పష్టంగా చెప్పినట్లు టాక్.


దీనితో ప్రస్తుతం ప్రభాస్ ఒక స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని రోజుకు మూడుగంటలు స్విమ్ చేస్తూ కేవలం లిక్వీడ్స్ తోనే ఒక స్పెషల్ డైటీషియన్ పర్యవేక్షణలో ప్రభాస్ తన లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ కోసం రాజమౌళి సలహాతో రోజుకు 16 కోడిగుడ్లు తిన్న ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలహాతో తన లుక్ ను మార్చుకునే పనిలో పడ్డాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: