వరస ఫ్లాప్ ల నుండి అఖిల్ కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ కొంత విరామాన్ని ఇచ్చింది. అయితే ఆ ఆనందం అఖిల్ కు ఎక్కువ కాలం నిలబడే అదృష్టం లేదా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ కు చాక్లెట్ బాయ్ ఇమేజ్ నచ్చదు మాస్ హీరోగా మారాలని అతడి కోరిక.


దీనితో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ మూవీని మొదలుపెట్టి ఆ మూవీని 50 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేద్దామని నిర్మాతలు అనుకున్నారు. అయితే ఈ మూవీ నిర్మాణం పూర్తి కావడం ఆలస్యం అవ్వడంతో పాటు ఈ మూవీ కథలో వచ్చిన మార్పుల రీత్యా ఈ మూవీ బడ్జెట్ 70 కోట్లకు చేరుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడల్తో ఈ మూవీకి దర్శకుడు సురేంద్ర రెడ్డి భాగస్వామిగా ఉంటానని చెప్పినట్లు టాక్.


అయితే ఇప్పుడు అతడి ఆలోచనలు మార్చుకుని ఈ మూవీకి సంబంధించి తనకు పారితోషికం కావాలని పార్టనర్ గా ఉండనని చెప్పినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీ కథలో వచ్చిన మార్పులు వల్ల ఈ మూవీ బడ్జెట్ కూడ పెరిగిపోయిందని దీనితో ఈ మూవీ ప్రకటించిన రిలీజ్ డేట్ సమయానికి విడుదల కాకపోవచ్చు అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.


వాస్తవానికి ఈ మూవీ కోసం అఖిల్ చాల కష్టపడ్డాడు. విపరీతంగా గంటల కొద్ది జిమ్ లో గడిపితన సిక్స్ ప్యాక్ బాడీని పెంచుకోవడమే కాకుండా దీనికోసం తన లుక్ ను కూడా చాల మార్చుకున్నాడు. అయితే ఈమూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో అఖిల్ కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితిని మించి ఈమూవీ బడ్జెట్ పెరిగిపోయింది అని అంటున్నారు. దీనితో ఈవిషయాలు అన్నీ నాగార్జున దృష్టి వరకు వేలుతున్నాయని అతడిని ఈమూవీకి సంబంధించి ఎదో ఒక పరిష్కారం చెప్పమని ఈ మూవీ నిర్మాతలు అడుగుతున్నట్లు టాక్. అక్కినేని కాంపౌండ్ సపోర్ట్ ఉండి కూడ అఖిల్ కు ఇంకా సరైన బ్రేక్ రాకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది...





మరింత సమాచారం తెలుసుకోండి: