ఇప్పటివరకు టాప్ హీరోల సినిమాలు కొనుక్కుని కోట్ల రూపాయలలో నష్టాలు పొందిన బయ్యర్ల కష్టాల గురించి ఎన్నోవార్తలు హడావిడి చేసాయి. అయితే టాప్ హీరోల సినిమాలు వల్ల ఆసినిమాల బయ్యర్లు మాత్రమే కాకుండా ఆమూవీల వల్ల టాప్ హీరోల వీరాభిమానులు  వల్ల నష్టపోతున్నారు అంటూ ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


టాప్ హీరోల సినిమాలు విడుదలరోజున హంగామా చేయడమే కాకుండా తమ హీరోల సినిమాలకు సంబంధించిన బెనిఫ్ట్ షోలను వేసి ఆషోల టిక్కెట్ల రేట్లను భారీ రేట్లకు అమ్మే సంస్కృతి మన తెలుగురాష్ట్రాలలో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈమధ్య కాలంలో ముఖ్యంగా కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదలకాబడ్డ టాప్ హీరోల సినిమా అభిమాన సంఘాలు వేసిన బెనిఫిట్ షోలు అన్నీ చాలవరకు ఫెయిల్ అయి ఆషోలను నిర్వహించిన అభిమాన సంఘాల నిర్వాహకులకు నష్టాలు తెచ్చిపెట్టాయని వార్తలు వస్తున్నాయి.


దీనికికారణం క్రితంలా సగటు ప్రేక్షకుడు టాప్ హీరోల సినిమాల టిక్కెట్లను ఎంత ధర అయినా కొని మొదటిరోజు బెనిఫ్ట్ షో చూడాలి అన్నఆలోచనలలో లేరని ఆమూవీ టాక్ వచ్చిన తరువాత తీరికగా చూడవచ్చు లేదంటే ఆమూవీకి సంబంధించిన సీన్స్ అన్నీ ఎలాగు పైరసీ ద్వారా లీక్ అయి తమ సెల్ ఫోన్స్ లోకి వస్తాయి కాబట్టి ఆ సీన్స్ అన్నీబాగుంటే నెమ్మదిగా సినిమా చూడవచ్చు అన్న సగటు ప్రేక్షకుడి ఆలోచన వల్ల ఇదివరకు లా బెనిఫిట్ షోల టిక్కెట్ల మ్యానియా తగ్గిపోయింది అంటున్నారు.


అందువల్ల టాప్ హీరోల బెనిఫ్ట్ షోలను నిర్వహిస్తున్న అభిమాన సంఘాల ప్రతినిధులకు ఆసినిమా టికెట్లు ఉండిపోవడంతో బెనిఫిట్ షో మొదలైన తరువాత కొన్ని అసలు ధరకు ఇచ్చేయవలసిన పరిస్థితులు ఏర్పడటంతో కొన్ని షాకింగ్ వార్తలు వస్తున్నాయి. దీనికితోడు అభిమాన సంఘాలు టాప్ హీరోల బెనిఫిట్ షోల టిక్కెట్లను కొన్ని కాంప్లిమెంట్స్ టిక్కెట్లుగా కూడ కొందరికి ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడటంతో టాప్ హీరోల సినిమాల బయ్యర్లకు మాత్రమే కాకుండా టాప్ హీరోల సినిమాల అభిమాన సంఘాలకు కూడ నష్టాలు వస్తున్నాయి అంటూ వస్తున్న వార్తలు విని కొందరు ఆశ్చర్యపోతున్నారు..







మరింత సమాచారం తెలుసుకోండి: