యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా పై ఎంతో మంది ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్టుగానే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగి పోయాయి.  అలా భారీ అంచనాల నడుమ థియేటర్లో విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీసు దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర సాధించింది.

ఇలా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లోకి కూడా వచ్చేసింది.  అమెజాన్ ప్రైమ్  'ఓ టి టి' లో ఎర్లీ యాక్సెస్ కింద కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పే ఫర్ వ్యూ పద్ధతిలో ప్రస్తుతం అందుబాటులో ఉంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్  బయటకు వచ్చింది.  కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ నుండి తుఫాన్ సాంగ్ ను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మరి ఈ వీడియో  సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: