అందాల ముద్దుగుమ్మ సమంత 'ఏ మాయ చేసావే' మూవీ తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సమంత ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంది. సమంత నటించిన సినిమాలు కూడా మంచి విజయలను సాధించడంతో అతి తక్కువ కాలంలోనే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. 

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటి వరకు కొనసాగుతున్న సమంత  దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమా లలో నటించింది. కొంత కాలం క్రితం విడుదల పుష్ప సినిమా లోని స్పెషల్ సాంగ్ ద్వారా సమంత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. పుష్ప సినిమా లోని స్పెషల్ సాంగ్ లో సమంత తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత కు ఓ అవార్డు వరించింది.

అసలు విషయం లోకి వెళితే...  సమంత 'ది ఫ్యామిలీ మాన్'  సీజన్ 2 వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  ఈ వెబ్ సిరీస్ లో సమంత నటనకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కిన విషయం కూడా మనకు తెలిసిందే.  తాజాగా ఫ్యామిలి మాన్ వెబ్ సిరీస్ లో సమంత నటనకు గాను ఉత్తమ నటి అవార్డు ఈ ముద్దుగుమ్మకు లభించింది.   ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో సమంత నటనకు గాను క్రిటిక్స్ ఛాయిస్ కింద ఉత్తమ నటి అవార్డును సమంత అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: