తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బొణీ, తీన్ మార్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆలోచించిన కృతి కర్బంధా కానీ ఆ చిత్రాలు ఆమెకు ఆశించిన స్థాయిలో హీట్ ఇవ్వలేకపోయాయి. అయితే అంతకుముందు బాలీవుడ్లోకి ప్రవేశించిన కృతికర్బంధ మంచి విజయాలను అందుకుంది. ఇక బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మి తో గౌరవ ఆరోరా వంటి చిత్రంతో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది కృతి.

సోషల్ మీడియా లో అప్పుడప్పుడు తన ఫిట్ నెస్ కి సంబంధించి కొన్ని టిప్స్ ఇవ్వడమే కాకుండా పలు వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా కృతి షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకునే లా ఉంది. ఈ వీడియో చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చే ఎక్ససైజ్ చెబుతోంది అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడినుండి అధిగమించవచ్చని ఆమె తెలియజేసింది. ఇక కృతికర్బంధ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల యువ హీరోల సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ చేస్తోందట.



తాజాగా ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో పాల్గొన్న కృతి కర్బంధా.. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టం అని తనకి నేను వీర అభిమానిని అని తెలియజేసింది. తన పాఠశాలలో చదువుతున్నప్పుడే కుచ్ కుచ్ హోతా హై సినిమా విడుదలయ్యింది ఆ సినిమాలో చూపించిన పాపులర్ ఫ్రెండ్షిప్ బాగా ఆకట్టుకుందని తెలియజేసింది. షారుక్ ఖాన్ తో ఎప్పటికైనా ఒక చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాను తనతోపాటు డ్యాన్సులు వేయాలని కూడా కృతి కర్బంధా తన కలగా తెలియజేసింది. గత సంవత్సరం బెంగళూరులో తన కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తూ గడిపేశాం అని తెలియజేసింది. తన కుటుంబంతో కలిసి ఆదివారం రోజున సినిమాలు చూడడానికి ఆరోజు అంకితం చేస్తానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: