యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావడం, ఆ సినిమా పనులన్నీ ఇప్పటికే ముగియడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫుల్ గా ఫోకస్ పెట్టాడు.

ఎన్టీఆర్  తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ కి సంబంధించిన అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. మే 20 వ తేదీన ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన అనేక విషయాలను చిత్ర బృందం వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 వ సినిమా కి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం ఇండియా లోనే మోస్ట్ క్రేజీ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం ఇండియా లోనే మోస్ట్ క్రేజీ కెమెరామెన్ గా పేరు తెచ్చుకున్న రత్నవేలు కెమెరామెన్ గా పని చేయనున్నట్లు సమాచారం.  ఇలా వీరితో పాటు మరి కొంత మంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం పని చేయనున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30వ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: