సర్కారు వారి పాట సినిమా విడుదలై మొదటి వారం పూర్తి చేసుకుంది. తొలిరోజే మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా వారాంతంలో బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించగా సోమవారం నుంచి అందరినీ నిరాశ కలిగిస్తుంది. అయితే ఈ సినిమా కు డబ్బులు రావాలంటే రెండవ వారం కూడా మంచి కలెక్షన్లను సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటికే 2 మిలియన్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి దీంతో ఒకసారి మహేష్ బాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ చెప్పినట్లు అయ్యింది.

ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటిదాకా 80 కోట్ల అందుకున్న ఈ సినిమాకు సోమవారం మంగళవారం భారీగానే వసూలు డ్రాప్స్ కనిపించాయి. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా అయినా మిక్స్డ్ టాక్ అందుకున్నా రెండవ వారంలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించిన దాఖలాలు లేవు. సర్కార్ వారి చిత్రానికి బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండవ వారం వసూళ్లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ వారంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించగలిగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెబుతున్నారు.

ఈ వారంలో ఏ క్రేజీ సినిమా విడుదల లేకపోవడం మహేష్ చిత్రానికి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఎఫ్3 సినిమా మే 26 న థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం కూడా సర్కార్ వారికి కలెక్షన్లు మరింత పెరుగుతాయి అని ఆశతో చిత్రబృందం ఉంది. ఇక మరికొంత మంది సైతం టికెట్ ధరలు తగ్గిన తర్వాత సినిమా చూడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండవ వారంలో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పటివరకు మహేష్ సహా అందరూ ఈ సినిమా ఫలితం ఎంతో హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో మహేష్ మాట్లాడిన మాటలకు అభిమానులు ఎంతగానో ఉత్సాహవంతులు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: