రెండు సంవత్సరాలుగా హీరో ఆది పినిశెట్టి, నిక్కి గర్లానీ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే .ఇక త్వరలోనే  పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కొన్ని రోజులుగా వీరిద్దరు ప్రేమించుకుంటునే ఉన్నారు. ఇద్దరు కలిసి గతంలో మరకతమణి సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఈ చిత్రం 2017 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు గా సమాచారం. వీరిద్దరి మధ్య స్నేహం మొదలై ఆ తరువాత పెళ్లి వరకు తీసుకు వచ్చారు.

కొన్ని రోజులుగా ఇద్దరు ప్రేమించుకున్న ట్లు గా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం ఆది వయస్సు 39 ఏళ్లు.. నిక్కీ గర్లాని వయసు 30 సంవత్సరాలు ముఖ్యంగా వీరిద్దరి మధ్య 9 సంవత్సరాల వయసు తేడా తెలుస్తుంది. ఇకపోతే వీరిద్దరూ త్వరలోనే ఏడడుగులు నడవపోతున్నారు . ఇక మార్చిన 24వ తేదీన ఇద్దరి కుటుంబాల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అంతే కాదు ఇండస్ట్రీలో నానీ తప్ప  ఏ ఒక్కరిని  ఈ  వేడుకకు పిలవకపోవడం  గమనార్హం. వీరిద్దరూ రహస్యంగా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వేడుకలు జరుపుకున్నారు.

ఇక జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండడం చాలా అత్యున్నతమైనది అని ఆది తెలపడం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పాడు ఈ యంగ్ హీరో. తాజాగా వీరిద్దరి హల్దీ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే అందుకే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆది పినిశెట్టి ప్రస్తుతం తెలుగు తమిళం లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇక మొన్నామధ్య క్లాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం రామ్ నటిస్తున్న ది వారియర్  సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇకపోతే వీరిద్దరూ ఏడు అడుగులు వేసి జీవితాంతం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: