ఈ మధ్యనే "అఖండ" సినిమాతో తన కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమా తో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారని అందరికి తెలిసిందే.. #ఎన్బీకే107 అని పిలవబడుతున్న ఈ సినిమా పై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ బ్యూటీ అయిన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హనీ రోజ్ వర్గీస్ రెండో హీరోయిన్ పాత్రలో బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందట.

అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి ని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగారు.. ఈ మధ్యనే "ఖిలాడీ" సినిమాలో కనిపించిన డింపుల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో విజయాన్ని అయితే సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నుంచి నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయట.. గోపీచంద్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా కనిపించబోతోందట డింపుల్ పాప .

ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడగగా డింపుల్ హయాతి ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ ఇండియన్ మోడల్ చంద్రికా రవి ని ఎంపిక చేసినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి మళ్ళీ ఐటమ్ సాంగ్స్ వెళ్ళకూడదని అనుకుంటుందట డింపుల్ పాప. అందుకే బాలయ్య సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో హీరోయిన్ గా చేయక ముందు వరుణ్ తేజ్ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ వల్ల మంచి గుర్తింపు పొందింది డింపుల్ హయతి.

మరింత సమాచారం తెలుసుకోండి: