టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున లతో పోటీగా సినిమా లలో నటించి , వారితో సమానమైన రెమ్యునరేషన్ తీసుకున్న రాజశేఖర్ ప్రస్తుతం మాత్రం వారితో పోటీపడడం లో చాలా వరకు స్లో అయిపోయాడు.  

వరుస పరాజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన రాజశేఖర్ టాలీవుడ్ యంగ్  డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ వేగ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.  ఆ తర్వాత రాజశేఖర్ 'కల్కి' సినిమాలో హీరో గా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో కల్కి సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా రాజశేఖర్ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ 'శేఖర్' సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమా మే 20 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ సినిమాకు జీవిత దర్శకత్వం వహించింది.  ఇప్పటి వరకు విడుదలైన శేఖర్ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

ఈ సినిమాలో రాజశేఖర్ తో పాటు రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది.సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ జోసెఫ్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా శేఖర్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  సెన్సార్ బోర్డ్ నుండి శేఖర్ మాకు యూ / ఎ సర్టిఫికెట్ లభించింది.  మరి రాజశేఖర్ 'శేఖర్' సినిమాతో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: