ఇలా నటుడు అరవింద్ స్వామి సెలబ్రెటీ గా బాగా క్రేజ్ ను తెచ్చుకున్నాడు. అయితే ఈయన భార్యకు అంతకన్న ఎక్కువ ఫాలోయింగ్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అరవింద్ స్వామి భార్య పేరు అపర్ణ ముఖర్జీ. ఈమె పెద్ద లాయర్. దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల్లో అపర్ణ ముఖర్జీ కూడా ఒకరు. విదేశాల్లో కూడా న్యాయవాదిగా వాదించే లైసెన్స్ ఈమెకు ఉంది అంటే ఈమె ఎంత పెద్ద లాయర్ అన్న విషయం అర్థమౌతుంది. ఆమె దేశంలో పలు కార్పోరేటర్ కంపెనీలతో పాటు బడా పారిశ్రామిక వేత్తలకు కూడా న్యాయ సేవలు అందిస్తూ ఉంటారు. అలా ఈమెకు బాగా పలుకుబడి కూడా ఉంది.
పెద్ద పెద్ద ఇండస్ట్రీ వారికి అపర్ణ ముఖర్జీ న్యాయ సేవలను అందిస్తూ ఉంటారు ఈమె. అరవింద్ స్వామికి చెందిన కంపెనీలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గాను ఈమె వ్యవహరిస్తున్నారు. బడా బడా కంపెనీలకు, సెలబ్రిటీలకు సైతం లీగల్ అడ్వైజరీగాను సేవలను అందిస్తుంటారు. ఇలా ఆమె ఫుల్ బిజీగా ఉంటారు. నెలకు ఈమె 35 కోట్లకు పైనే ఎర్న్ చేస్తారట. ఒక స్టార్ హీరో భార్య గానే కాకుండా ప్రముఖ న్యాయవాదిగా ఈమెకు పాపులారిటీ ఉంది.