మాస్ హీరోగా గుర్తింపు పొంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరో విశ్వక్ సేన్. ఇతడు చేసిన ప్రతి సినిమా ప్రత్యేకమే. తాజాగా విడుదల అయిన ఈ హీరో చిత్రం "అశోక వనం లో అర్జున కళ్యాణం" చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సంతోషం లో ఉర్రూతలూగుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎంత రాద్దాంతం జరిగింది అన్నది తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ను కాస్త డిఫరెంట్ గా చేయాలనుకున్న మూవీ టీం విమర్శలను ఎదుర్కొంది. హీరో విశ్వక్ అయితే వివాదాల మద్య చిక్కుకున్నాడు. సినిమా ప్రమోషన్స్ అంటూ రోడ్డుపై ప్రాంక్ చేయడంతో విశ్వక్ సేన్ పై పలువురు విరుచుకుపడ్డ విషయం విదితమే. అదీ సరిపోదు అన్నట్టు ఈ విషయంపై విశ్వక్ సేన్ ను టీవి 9 ఛానల్ వారు పిలవగా అక్కడకు వెళ్లిన విశ్వక్ కు చుక్కెదురు అయ్యింది.

అక్కడ యాంకర్ దేవి నాగవల్లి తో మాట మాట పెరిగి అది మరో వివాదంగా మారింది. అయితే ఇన్ని అడ్డంకుల మద్య రిలీజ్ కు ముందే నెగిటివ్ టాక్ తో అందరి నోటా నిండిన ఈ సినిమా సక్సెస్ అందుకోవడం దాదాపు అసంభవమే అనుకున్నారు అంతా...కాగా ఇలా ఎన్నో అడ్డంకుల మద్య రిలీజ్ అయిన ఈ సినిమా కాస్త సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అసలు ఈ సినిమా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అనుకున్న చాలామంది ఈ సక్సెస్ ను చూసి షాక్ అయిపోయారు. ఇదంతా ఒక పక్క అయితే.. హీరో విశ్వక్ సేన్ అయితే ఫుల్ టు బిందాస్ తో ఉరకలు వేస్తున్నారు. ఈ వివాదమే మా సినిమాకి మరింత ప్లస్ గా మారుతుంది అంటూ తిట్టిన వారి మాటలకు కౌంటర్లు విసిరిన విశ్వక్ సేన్ మాటలు నిజమయ్యాయి. విద్యా సాగర్ చింత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆడియన్స్ కి మంచి రిఫ్రెషింగ్‌గా మారింది. ముఖ్యంగా పెళ్లి విషయంలో హీరో చెప్పే డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నిన్న మొన్నటి వరకు రఫ్ లుక్ తో, మాస్ హీరోగా కనిపించిన విశ్వక్ ఈ సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించి తన పర్ఫార్మెన్స్ తో అట్రాక్ట్ చేశారు.   ఇక తన సినిమా సక్సెస్   ఆనందంలో ఉన్న ఈ యంగ్ హీరో అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. గతంలో  రేంజ్ రోవర్ కారును కొన్న విశ్వక్... ఇప్పుడు బెంజ్ కారుని కొని ఆశ్చర్యపరిచారు. మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 మోడల్‌ను తన సొంతం చేసుకుని ఆ ఫోటోలను షేర్ చేశారు. దీని ధర  దగ్గర దగ్గర మూడు కోట్ల వరకు ఉంటుంది.
ఈ పోస్ట్ లను చూసిన పలువురు సెలబ్రిటీలు , నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అలీ రెజా  కంగ్రాట్స్ విశ్వక్ అంటూ అభినందనలు తెలుపగా దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే అది నా కార్.. ఫోటోలు దిగుతానంటే విశ్వక్ ఇచ్చాను అంటూ మజాక్ చేశారు. మరికొందరు పార్టీ ఎపుడు బ్రో అంటూ అడుగుతున్నారు. మొత్తానికి తనను తన చిత్ర సక్సెస్ సంతోషంలో మునిగి తేలుతున్నారు హీరో విశ్వక్సేన్..

మరింత సమాచారం తెలుసుకోండి: