పాన్ ఇండియా స్టార్ గా పేరుపొందిన ప్రభాస్ ఇతర హీరోల సినిమాలు మరియు చిన్న చిత్రాలను తన వంతు సపోర్ట్ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన కంటెంట్ ని కూడా అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ కావాల్సినంత భజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా శేఖర్ చిత్రానికి సంబంధించి ప్రభాస్ తన మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ సినిమాకి రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించింది.


ఇక ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇలాంటి నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా శేఖర్ సినిమాలోని సత్యం శివం అనే సాంగ్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సాంగ్ ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా కనిపిస్తుంది. ఇందులో రాజశేఖర్ వాయిస్ మీద పడిన లుక్ లో కనిపించారు. ఇక ఆయన కుమార్తె శివాని కూడా ఈ పాటలో భాగం పంచుకున్నది.

ఈ చిత్రం ఇన్వెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కిచడం జరిగింది. ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జోసెఫ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఇందులో సమీర్, రవి వర్మ, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో ఈ సినిమాను తెరకెక్కించడం జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన బీరం సుధాకర్ రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, శివాని రాజశేఖర్, శ్రీనివాసులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల మాటలు రాయడం జరిగింది. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా శివాని కలిసి నటించిన ఈ చిత్రం ఎలాంటి ను సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: