టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీలు చెల్లెళ్లు, కూతుర్లు అయిపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. ఇక అటు పెద్ద హీరోల వయసు పెరుగుతున్నా కానీ వీళ్ల పక్కన హీరోగానే చేస్తామని కాకుండా అన్నలు ఇంకా అలాగే నాన్నలుగా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి తమ ట్రెండ్ ని మారుస్తున్నారు.ఇక వెంకటేశ్ చెల్లెలిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుంది. ఎఫ్3 సినిమాలో పూజాతో కలిసి స్పెషల్ సాంగ్ కి స్టెప్పులేసిన వెంకటేష్ ఆమెకు అన్నగా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా కభీ ఈద్ కభీ దివాళీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ ఫుల్ లెంత్ రోల్ కి కూడా యాక్సెప్ట్ చేశాడు. త్వరలోనే షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమాలో బుట్టబొమ్మకు బ్రదర్ గా వెంకటేష్ నటిస్తున్నారు.



అలాగే భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేశ్ నటిస్తోంది. ముందు సాయిపల్లవిని అనుకున్నారు కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు.అందుకే కీర్తిని ఫైనల్ చేసి సినిమాను పూర్తి చేస్తున్నారు. అన్నాత్తే సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెల్లెలిగా కనిపించిన కీర్తి.. త్వరలో టాలీవుడ్ మెగాస్టార్ సిస్టర్ గా కూడా సందడి చేయనుంది. అయితే ఆచార్య సినిమా రిజల్ట్ కారణంగా భోళాశంకర్ పలు మార్పులు చేస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది.అలాగే నందమూరి బాలకృష్ణ ఇంకా శ్రీలీల కూడా స్క్రీన్ చేసుకోబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే బాలయ్య చెల్లెలిగా కాదు ఆయనకు కూతురుగా శ్రీలీల నటిస్తుందని సమాచారం. గోపీచంద్ మలినేని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటసింహం బాలకృష్ణ నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలోనే ఆయనకు 20 ఏళ్ల కూతురిగా శ్రీలీల కనిపించబోతున్నట్టు చెప్తున్నారు. అయితే త్వరలోనే ఇది నిజమా కాదా అనే విషయం కూడా తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: