1990 ప్రాంతాలలో కెరియర్ పీక్ లో ఉండేది. అప్పట్లో అతడికి లేడీస్ ఫాలోయింగ్ కూడ బాగా ఉండేది. అయితే 2000 సంవత్సరం వచ్చేసరికి అతడి కెరియర్ ఫ్లాప్ ల బాట పట్టడంతో నెమ్మదినెమ్మదిగా అతడి ఇమేజ్ అదేవిధంగా మార్కెట్ తగ్గిపోయింది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి మరొక హీరోకి ఎదురైతే ఏనాడు అతడి పేరును కూడ జనం మర్చిపోయి ఉండేవారు.


అయితే రాజశేఖర్ అతడి భార్య జీవిత గత 20 సంవత్సరాలుగా పరిస్థితులతో పోరాటం చేస్తూ జనం తమను మర్చిపోకుండా ఎదోఒక వివాదాస్పద విషయంలో ఎంటర్ అవుతూ తమ ఉనికిని కొనసాగిస్తున్నారు. సుమారు దశాబ్ద కాలం వరస పరాజయాలు తరువాత రాజశేఖర్ మూవీ ‘గరుడవేగ’ సక్సస్ కావడంతో తిరిగి అతడు ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్నారు. అయితే ఆతరువాత నటించిన ‘కల్కి’ సినిమాతో మళ్ళీ పరాజయం అతడిని పలకరించింది.

అయినా నిరుత్సాహ పడకుండా తన శక్తులు అన్నీ కూడపెట్టుకుని ఇతడు నటించిన ‘శేఖర్’ మూవీ ఈవారం విడుదల కాబోతోంది. ఈసినిమాకు పోటీ చెప్పుకోతగ్గ సినిమాలు ఏవీ లేవు. సంపూర్ణేష్ నటించిన ‘దగడ్ సాంబ’ మూవీ విడుదల అవుతున్నప్పటికీ ఆసినిమా చెప్పుకోతగ్గది కాదు. మళయాళంలో హిట్ అయిన మూవీ రైట్స్ కొనుక్కుని జీవిత ఈసినిమాను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడ వహించింది.


లుక్ పరంగా ఈమూవీలో రాజశేఖర్ 60 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ ఒక రివెంజ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈమధ్య కాలంలో రాజశేఖర్ సినిమాలకు ప్రేక్షకులు రావడం పూర్తిగా మానేశారు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే వచ్చేవారం ‘ఎఫ్ 3’ వరకు ‘శేఖర్’ మూవీ నిలబడే ఆస్కారం. ఆవిధంగా జరగాలి అంటే ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావాలి. అలాంటి అదృష్టం రాజశేఖర్ కు ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ శుక్రువారం వరకు ఎదురు చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: