ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా ఒక పరాజయం ఎటువంటి భయాలను క్రియేట్ చేస్తుందో దర్శకుడు కొరటాల శివ విషయంలో జరుగుతోందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ‘ఆచార్య’ విడుదలకు ముందే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కథకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ఫైనల్ చేసాడు అన్న వార్తలు వచ్చాయి.


అయితే ‘ఆచార్య’ ఫలితం తారుమారు కావడంతో కొరటాల మళ్ళీ జూనియర్ తో తీయబోతున్న మూవీ స్క్రిప్ట్ కు సంబంధించి చాల మార్పులు చేర్పులు చేసాడట. వాస్తవానికి కొరటాల శివ ఒకసారి ఒక హీరోతో ఒక కథ అనుకున్న తరువాత ఆకథకు పెద్దగా మార్పులు చేయడు అని అంటారు. దీనికి భిన్నంగా కొరటాల జూనియర్ తో తీయబోతున్న కథ విషయంలో అనేక మార్పులు తారక్ సలహాలతో చేసాడట.


ఈ పరిస్థితులలో రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయవలసిన ఈమూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ పై కూడ కొరటాల తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. కొరటాల ప్రస్తుతం అనేకమంది డ్రాయింగ్ ఆర్టిస్టులను గ్రాఫిక్ డిజైనర్లను పక్కన పెట్టుకుని ఈ ఫస్ట్ లుక్ డిజైనింగ్ కోసం రాత్రిపగలు ఎలాంటి విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈ ఫస్ట్ లుక్ పోష్టర్ డిజైనింగ్ ఈరోజు మధ్యాహ్ననానికి ఫైనల్ చేసుకుని ఆతరువాత ఆ పోష్టర్ ను తారక్ కు చూపించి అతడి అనుమతి వచ్చిన తరువాత రేపు జరగబోయే జూనియర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విడుదల చేస్తారని తెలుస్తోంది. అదేరోజు తారక్ ప్రశాంత్ నీల్ ల మూవీ ప్రాజెక్ట్ ప్రకటన ఉంటుంది అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటున్నారు. తారక్ పుట్టినరోజునాడు విడుదల కాబోతున్న కొరటాల మూవీకి సంబంధించిన పోష్టర్ ను రేపటి సోషల్ మీడియా ట్రెండింగ్ గా మార్చాలని అభిమానులు ఇప్పటి నుంచే భారీ వ్యూహాలలో ఉన్నట్లు తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: