ఒకప్పుడు ఈ షోలో కేవలం డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా అందుతుంది అని చెప్పాలి. ఇకపోతే సాధారణంగా యాంకర్ గా మారిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా తక్కువగానే చూసి ఉంటారు ప్రేక్షకులు. కానీ ఇటీవల ఢీ షో లో మాత్రం ప్రదీప్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించిన ఢీ షో ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా కంటెస్టెంట్స్ తో కలిసి ఏకంగా ప్రదీప్ అదిరిపోయే డ్యాన్స్ చేశాడు.
రెండు మూడు పాటలను మిక్స్ చేసి కంటెస్టెంట్స్ డాన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ పర్ఫామెన్స్ లో భాగంగా మొదటి నుంచి చివరి వరకు ప్రదీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. మధ్యలో తీన్మార్ డాన్స్ కూడా చేస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ప్రదీప్ పర్ఫామెన్స్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా మైమరచిపోతారు అని చెప్పాలి. ఎన్నాళ్ళకి ప్రదీప్ డాన్స్ చూస్తే అదృష్టం వచ్చింది అని అభిమానులు కూడా ఆనందపడి పోతున్నారు. ఇక ప్రదీప్ ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.