మెగా నందమూరి హీరోల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించగా ఇప్పటికీ కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.యస్ యస్ రాజమౌళి వల్లే మెగా నందమూరి హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడానికి ఓకే చెప్పారు. అయితే చాలా సంవత్సరాల క్రితమే ఈ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా ఉంది.అయితే అది ఆగిపోయింది. రానా ప్రతాప్ కథతో రాజమౌళి డైరెక్షన్ లో వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో తెరకెక్కాల్సి ఉంది.అయితే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేసిన సుకుమార్ అనే వ్యక్తి పరోక్షంగా ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి కారణమయ్యారు. ఇక ఈ ఇద్దరు హీరోల మధ్య బేధాభిప్రాయాలు వచ్చేలా ఆ వ్యక్తి చేయడంతో ఈ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోవడం జరిగింది. ఒకవేళ ఈ కాంబినేషన్ లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కి గనుక ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ అయ్యి ఉండేవని చెప్పవచ్చు.



ఇక రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ దిశగా ఏ స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ ప్రొడ్యూసర్ అడుగులు వేస్తారేమో అనేది చూడాలి. మెగా నందమూరి హీరోలు కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కథ నచ్చితే స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధమేనని వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. సినిమా సినిమాకు కూడా ఎన్టీఆర్ కు క్రేజ్ అంతకంతకూ బాగా పెరుగుతోంది.ఇక రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా కొరటాల శివ ఇంకా ప్రశాంత్ నీల్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఈ అప్ డేట్లలో ఏ అప్డేట్ అనేది ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: