రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం  ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో సలార్ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో  ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కే జి ఎఫ్ చాప్టర్ 2  విడుదల కాకా ముందే సలార్ మూవీ  షూటింగ్ ను మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్  'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ  విడుదల కారణంగా సలార్ సినిమా షూటింగ్ ను కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు. 

ఇప్పటికే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల కావడం , భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం అన్నీ జరిగిపోయాయి.  ఇలా కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో తిరిగి ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ  షూటింగ్ ను ప్రారంభించబోతున్న సమాచారం. అందులో భాగంగా సలార్ మూవీ  నెక్స్ట్ షెడ్యూల్ ను మే 24 వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ మూవీ తాజా షెడ్యూల్ కోసం  రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అదిరిపోయే రేంజ్ లో బల్క్ డేట్స్ ను  ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో సలార్ చిత్ర బృందం ఈ మూవీ కి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనునట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో తెరకెక్కించబోయే యాక్షన్ సన్నివేశాలు ఈ సలార్ మూవీ కే హైలెట్ గా నిలవణునట్లు తెలుస్తోంది.

సలార్ మూవీ లో యాక్షన్ సన్నివేశాలకు చిత్ర బృందం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో సలార్ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి అని ప్రేక్షకులు అంచనా వేసుకుంటున్నారు.  మరి సలార్ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: