సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు చెప్పనవసరం లేదు. మే 12 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ , అదిరిపోయే కలెక్షన్లను మాత్రం బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కార్ వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 78.90 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించింది. ఇప్పటి వరకు 7 రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల వరుసలో సర్కారు వారి పాట సినిమా 6 వ స్థానంలో నిలిచింది. సర్కారు వారి పాట సినిమా కంటే ముందు ఐదు సినిమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 7 రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల  బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి 117.92 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


అలా వైకుంఠపురంలో : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 7 రోజుల బాక్సాపీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో  88.25 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.


సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా 7 రోజుల బాక్సాపీస్ రన్ ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.82 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

 
సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా 7 రోజుల బాక్సాపీస్ వద్ద ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.49 కోట్ల  షేర్ కలెక్షన్ వసూలు చేసింది.


సర్కారు వారి పాట సినిమా కంటే ముందు వరుసలో ఈ ఐదు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: