దర్శక ధీరుడు రాజమౌళి కెరియర్ లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలూగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత అఖండమైన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వతంత్ర సమరయోధులు అయిన అల్లూరి సీతారామరాజు కొమురంభీం పాత్రలో ఇద్దరు హీరోలు నటించడంతో ఫాన్స్ అందరు ఇది చూసి పులకరించిపోయారు అని చెప్పాలి. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గర్జించింది. పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ పేరు అటు భారత దేశ వ్యాప్తంగా మారుమోగేలా చేసింది త్రిబుల్ ఆర్ సినిమా.


 ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం ఇద్దరు హీరోల నటన మాత్రమే కాదు అటు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి ప్రాణం పోసిందని అని చెప్పాలి. విఎఫ్ఎక్స్ వర్క్స్ కు ఇక ఈ సినిమాలో ఎంత పెద్ద పీట వేశారు అని సినిమా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సమయంలో పెద్దపులితో ఎన్టీఆర్ చేసే పోరాటం ఓ సన్నివేశంలో ఏకంగా రామ్ చరణ్ టైగర్ మధ్య ఫైట్.


 మరొక సన్నివేశంలో రామ్ చరణ్ పై విష నాగు దాడి చేయడం లాంటివి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్  ద్వారానే చేశారు. ఇక ఇవి  ప్రేక్షకులందరినీ కూడా అబ్బురపరిచాయి అని చెప్పాలి. ఇలా ఎన్నో సన్నివేశాలకు కూడా విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక త్రిబుల్ ఆర్ సినిమా లో టైగర్ ని ఎలా క్రియేట్ చేశారు విఎఫ్ఎక్స్ ఎలా ఉపయోగించారూ అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ఒక వీడియో ని విడుదల చేసింది త్రిబుల్ ఆర్ చిత్రబృందం. వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత త్రిబుల్ ఆర్ విజువల్ వండర్ గా మారడానికి వెనుక ఎంత కష్టం ఉందో అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr