పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యి అన్నీ ప్రాంతాలలో మంచి టాక్ ను అందుకుంది.ముఖ్యంగా బాలివుడ్ జనాలకు ఈ సినిమా తెగ నచ్చేసింది..ఈ సినిమాను మాములుగా రిసీవ్ చేసుకోలేదు..అక్కడ బాక్సాఫిస్ పుష్ప సినిమాతో రికార్డులు బ్రేక్ చెసింది.అక్కడ ఈ సినిమా మాసివ్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమా సీక్వెల్‌పైనే ఉన్నాయి. ఇక అందరి ఎదురుచూపులకు ఎక్కువ సమయాన్ని తీసుకోబోమని.. ఈ యేడాది డిసెంబర్ నాటికి పుష్ప 2 చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతామని సుకుమార్ గతంలో వెల్లడించాడు. అయితే వారు పక్కా ప్రణాళికతో ఈ చిత్ర షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెట్టి, డిసెంబర్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని చూశారు. కానీ మే నెల సగం దాటినా కూడా ఇప్పటివరకు పుష్ప2 చిత్రం పట్టాలెక్కలేదు.
దాంతో సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో అని జనాలు ఆలోచనలో పడ్డారు.ఇక్కడే సుకుమార్ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. స్క్రిప్టు పనుల్లో ఆలస్యం అయిన విషయం వాస్తవమే అయినా.. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్‌తో పుష్ప 2 చిత్రాన్ని పరుగులు పెట్టించేందుకు సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. ఈ మేరకు బన్నీని కూడా ఈ సినిమా షూటింగ్‌ను అనుకున్న సమయానికంటే ముందుగానే ఫినిష్ చేయాలని కన్విన్స్ చేశాడట. ఇక వీరిద్దరు కలిసి పుష్ప 2 చిత్రాన్ని ఒక్కసారి పట్టాలెక్కించగానే ఈ సినిమా షూటింగ్ పరుగులు పెట్టనుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది..అయితే సుక్కు నిజంగానే ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తాడా? లేదా? అన్నది చూడాలి..