ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రావడం కామన్.. ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నీ కూడా అలాగే వస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప..బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఒక కమర్షియల్ సినిమా ఇలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అనే రేంజ్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ కూడా అనుకోలేదట. వారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఈ సినమా బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేసుకుంది..


పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యి అన్నీ ప్రాంతాలలో మంచి టాక్ ను అందుకుంది.ముఖ్యంగా బాలివుడ్ జనాలకు ఈ సినిమా తెగ నచ్చేసింది..ఈ సినిమాను మాములుగా రిసీవ్ చేసుకోలేదు..అక్కడ బాక్సాఫిస్ పుష్ప సినిమాతో రికార్డులు బ్రేక్ చెసింది.అక్కడ ఈ సినిమా మాసివ్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమా సీక్వెల్‌పైనే ఉన్నాయి. ఇక అందరి ఎదురుచూపులకు ఎక్కువ సమయాన్ని తీసుకోబోమని.. ఈ యేడాది డిసెంబర్ నాటికి పుష్ప 2 చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతామని సుకుమార్ గతంలో వెల్లడించాడు. అయితే వారు పక్కా ప్రణాళికతో ఈ చిత్ర షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెట్టి, డిసెంబర్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని చూశారు. కానీ మే నెల సగం దాటినా కూడా ఇప్పటివరకు పుష్ప2 చిత్రం పట్టాలెక్కలేదు.



దాంతో సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో అని జనాలు ఆలోచనలో పడ్డారు.ఇక్కడే సుకుమార్ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. స్క్రిప్టు పనుల్లో ఆలస్యం అయిన విషయం వాస్తవమే అయినా.. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్‌తో పుష్ప 2 చిత్రాన్ని పరుగులు పెట్టించేందుకు సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. ఈ మేరకు బన్నీని కూడా ఈ సినిమా షూటింగ్‌ను అనుకున్న సమయానికంటే ముందుగానే ఫినిష్ చేయాలని కన్విన్స్ చేశాడట. ఇక వీరిద్దరు కలిసి పుష్ప 2 చిత్రాన్ని ఒక్కసారి పట్టాలెక్కించగానే ఈ సినిమా షూటింగ్ పరుగులు పెట్టనుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది..అయితే సుక్కు నిజంగానే ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తాడా? లేదా? అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: