సౌత్‌ సినీ ప్రేక్షకుల ముందుకు ఇటీవల వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ ఇంకా కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు ఎంతటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయో అసలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దేశావ్యాప్తంగా కూడా సరికొత్త రికార్డులు నమోదు చేశాయి.అలాగే భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమా లు కూడా 1100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాయి.ఇక ఈ సినిమాలను చూడాలని ప్రతి ఒక్కరు కోరుకున్నా కూడా థియేటర్ల లో భారీ టికెట్ల రేట్లు పెట్టి చూడలేక చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎదురు చేశారు.ఇక ఎట్టకేలకు ఓటీటీ లో ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆ సినిమాలను చూడాలంటే రెంట్‌ కట్టాలంటూ ఓటీటీ లు మెలిక పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా దెబ్బకు ముక్కున వేలేసుకున్నారు.బాబోయ్‌ ఇదేం రచ్చరా నాయన అంటూ ఎన్నో రకాల కామెంట్స్ చేశారు.



చాలా మంది కూడా చాలా రకాలుగా ఆ నిర్మాతలను విమర్శించారు. అలాగే అమెజాన్ లో కేజీఎఫ్‌ 2 ను చూడటం కోసం భారీ మొత్తంలో పెట్టాల్సి ఉండటంతో కనీసం వందల సంఖ్యలో కూడా ఆ సినిమాను చూడలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా విమర్శలు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇక చేసేది లేక సినిమాను ఓటీటీ పే పర్ వ్యూ పద్దతిన కాకుండా డైరెక్ట్ గా ఫ్రీ గా చూసే ఛాన్స్ ను కల్పించారు.దాంతో సోషల్‌ మీడియాలో ఓటీటీ వినియోగదారులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా విమర్శించడంతో వారికి బుద్ది వచ్చినట్లుగా ఉంది. అందుకే ఓటీటీ ఖతాదారులకు ఫ్రీగానే చూపించేందుకు రెడీ అయ్యారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఓటీటీ లో ఈ రెండు సినిమా లు కూడా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు.ఇక సినిమాను మళ్లీ మళ్లీ స్ట్రీమింగ్‌ చేస్తున్న వారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: