కేజీఎఫ్2' సినిమాను పాన్ ఇండియా ఫిల్మ్ అని పిలుస్తుంటే ఫన్నీగా అనిపిస్తుందంటూ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేయటం అంతటా కూడా హాట్ టాపిక్ గా మారింది.


తను తాజాగా నటించిన 'ఎస్కేప్ లైవ్' అనే సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉందట.ఈ సిరీస్ ను ప్రమోట్ చేసే క్రమంలో ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు సిద్ధార్థ్. ఈ సమయంలో 'కేజీఎఫ్2' సక్సెస్, పాన్ ఇండియా కాన్సెప్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.అయితే అవి అందరి దృష్టినీ ఆకర్షించటానికి ఇలా మాట్లాడాడా లేక కడుపు మంటతో ఇలా మాట్లాడాడా అనేది తెలియటం లేదని సోషల్ మీడియాలో జనం అనుకుంటున్నారు..


పాన్ ఇండియా అనే పదం వినడానికి చాలా ఫన్నీగా ఉందని.. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నానని.. ఏ భాషలో నటిస్తే ఆ భాషకు డబ్బింగ్ చెప్పుకునేవాడినని ఆయన అన్నారట.. తనవరకు వాటిని ఇండియా సినిమాలని పిలవడమే ఇష్టమని.. పాన్ ఇండియా అంటుంటే తనకు అగౌరవంగా అనిపిస్తుందని అన్నారట.. ఈ మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనడం లేదని ఆయన స్పష్టం చేశారు.


బాలీవుడ్ నుంచి ఒక సినిమా విడుదలై హిట్ కొడితే దాన్ని హిందీ సినిమా అనే అంటారని.. అదే ప్రాంతీయ సినిమాల విషయంలో అలా ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ చిత్రాలను మంచి ఆదరణ లభించి.. భారీ విజయం సాధిస్తే వీటిని పాన్ ఇండియా అని పిలవడం ఎందుకని..? ఇండియన్ సినిమా అని అనొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.


లేదంటే 'కేజీఎఫ్' జర్నీని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ సినిమా అని పిలవొచ్చని కూడా అన్నారు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పాలని ఆయన సూచించారు. పాన్ అంటే ఏమిటో తనకు అర్ధం కావడం లేదని.. ఆ పదం చాలా ఫన్నీగా ఉందని కూడా అన్నారు. విపరీతంగా ఈ మాటలు అయితే ట్రోల్ అవుతున్నాయి.


సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 దండయాత్ర ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఇప్పటివరకూ రూ.1200 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ క్లబ్‌లో చేరిన మూడో ఇండియన్ సినిమాగా ఇది నిలిచింది. అమీర్ ఖాన్ దంగల్, ప్రభాస్ బాహుబలి చిత్రాల తర్వాత ఆ స్థాయి వసూళ్లు రాబట్టింది కేజీఎఫ్ 2 మాత్రమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: