సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన చిత్రం F2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది. అంచనాలకు మించి సక్సెస్ ని అందుకున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఫుల్ లెన్త్ లో నాన్ స్టాప్ కామెడీ తో ప్రేక్షకుడిని సీట్లో కూర్చోనివ్వకుండా ఎంటర్టైన్ చేసింది ఈ చిత్రం. అయితే ఇక అప్పటి నుండి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అభిమానులంతా కోరుకుంటున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కింది. త్వరలో మన ముందుకు రావడానికి సిద్దం అవుతోంది.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు భారీగా పారితోషకం అందుకున్నారు అని f2 సినిమాతో పోలిస్తే ఎఫ్ 3 కి భారీగా పారితోషకం డిమాండ్ చేసి మరీ అందుకున్నారు అని తెలుస్తోంది. దిల్ రాజు కూడా చేసేది లేక అడిగినంత ఇచ్చేసారట.  వెంకటేష్ ఎంత సక్సెస్ఫుల్ హీరో అయినా ఆయన పారితోషకం ఇప్పటి వరకు 6 లేదా 7 కోట్లకు మించ లేదట. అయితే ఎఫ్ 3 సినిమాకి గాను ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకున్నారట.  
   
అయితే f2 కోసం వెంకీ తీసుకున్న పారితోషకం 5 కోట్లు కాగా... సీక్వెల్ కి ఏకంగా 3 రెట్లు పెంచేశారు. ఇక ఈ సినిమా టోటల్ బడ్జెట్ 50 కోట్లు కాగా అందులో ఎక్కువ భాగం నటీనటులకు సరిపోయింది. పూజ హెగ్డే స్పెషల్  సాంగ్, సునీల్, వెన్నెల కిషోర్ , అలి వంటి వారికి సైతం ఈ సినిమాలో నటించినందుకు గాను భారీగానే పారితోషకం అందింది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇది అంచనాలకు అందుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మధ్య రొటీన్ కు భిన్నంగా అన్నీ సినిమాలు వస్తున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి కాస్త తెలుగు ప్రేక్షకుల అభిరుచిని గమనించి కామెడీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: