యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తున్నా రోజు రానేవచ్చింది ఎన్నో రోజులుగా అందరూ ఆసక్తిగా చూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా కు సంబంధించి తాజాగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న #NTR 30 నుంచి ఒక బిగ్ సర్ప్రైజ్ విడుదల చేయడం జరిగింది. రేపటి రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ను ఈరోజు అభిమానుల కోసం ముందుగానే ప్యూరి ఆఫ్#NTR 30 అనే పేరుతో ఒక మోషన్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.


ఇందులో సముద్రతీరాన రక్తం ఏరులై పారుతున్న గొడవల మధ్య ఒక చేత్తో గొడ్డలి మరొక చేత్తో కత్తి పట్టుకొని ఎన్టీఆర్ నిలబడి బ్యాక్ సైడ్ లో అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ మొదట డైలాగ్ తో ఈ సినిమా వీడియోని మొదలుపెడతారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియో చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్య స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్న కొరటాల శివసినిమా మోషన్ పోస్టర్ ను తెలుగులో పాటు తమిళ ,హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు.


మలయాళం భాషలో తప్ప ఇతర భాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అనిచెప్పవచ్చు. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే పోతోంది చిత్రబృందం. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం కనుక ఈ సినిమాని వారి చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని డైరెక్టర్ కొరటాల శివ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: