సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్బస్టర్ సినిమాలతో ఇప్పటికీ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుత కాలంలో మాత్రం అలాంటి బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకోవడంలో చాలా వరకూ స్లో అయ్యాడు.  సూపర్ స్టార్ రజినీకాంత్,  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత రజినీ కాంత్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఒక రోబో 2.O  సినిమాను మినహాయిస్తే మిగతా సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకులను చాలా వరకు నిరాశ పరిచాయి.  

తాజాగా రజనీ కాంత్ 'అన్నాత్తే' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది.  చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కాస్త అలరించినప్పటికి తెలుగు ప్రేక్షకులను మాత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర వరుస పరాజయాలు ఎదురవుతున్నప్పటికి రజనీకాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రజనీ కాంత్ సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ కనుక సాధించినట్లు అయితే ఆ సినిమా  కలెక్షన్ల వర్షం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఆ ఉద్దేశం తోనే సూపర్ స్టార్ రజనీ కాంత్ కు బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుత కాలంలో సరైన విజయాలు లేకపోయినప్పటికీ ప్రొడ్యూసర్ లు మాత్రం అదిరిపోయే రెమ్యూనరేషన్ ను రజనీకాంత్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది.  

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా నటించిన అన్నాత్తే సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.  ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ మరి కొన్ని రోజుల్లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం రజినీ కాంత్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ వార్తే  కనుక నిజం అయితే ఇప్పటివరకు ఇండియాలోనే ఎ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రజినీకాంత్ నిర్మిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: