యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ సినిమా లలో , అంతకు మించిన రేంజ్ సినిమా లలో నటిస్తూ బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ మరి కొద్ది రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరైన మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే రాజా డీలక్స్ అనే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.  

హర్రర్ కథాంశంతో తెరకెక్కి బోయే ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా ఇప్పటికే ఆ ముగ్గురు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా చిత్ర బృందం అనుష్క ను ఎంపిక చేసినట్లు సమాచారం.  ఇక పోతే మరో ఇద్దరు హీరోయిన్ ల కోసం చిత్ర బృందం వెతుకులాటను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ప్రభాస్,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే హర్రర్ సినిమా రాజా డీలక్స్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  

అసలు విషయం లోకి వెళితే... ప్రభాస్,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే క్రేజీ మూవీ రాజా డీలక్స్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా చిత్ర బృందం తమన్ ను ఓకే చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే , ఆది పురుష్,  సోలార్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండగా,  మారుతి 'పక్కా కమర్షియల్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో  తెరకెక్కబోతున్న రాజా డీలక్స్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా కొంచం సమయం పట్టేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: