నందమూరి నట సింహం బాలకృష్ణ కారోనా థర్డ్ వావ్ తర్వాత విడుదల అయిన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. టికెట్ ధరలు తక్కువ ఉన్న సమయం లోనూ బాలకృష్ణ 'అఖండ' మూవీ తో  దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్ లను అందుకని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించారు. అలా అఖండ సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటిస్తున్న సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమా. ఈ సినిమాలో అదిరిపోయే ఒక స్పెషల్ సాంగ్ ను గోపీచంద్ మలినేని ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు సమాచారం.  ఇది ఇలా ఉంటే ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట చిత్ర బృందం హాట్ బ్యూటీ డింపుల్ హయాతి చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం.  కాకపోతే డింపుల్ హాయతి  వరస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి నో చెప్పినట్లు తెలుస్తోంది.

దానితో ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ కోసం ఆస్ట్రేలియన్ బ్యూటీ, మోడల్, భారత సంతతికి చెందిన చంద్రిక రవిని  చిత్ర బృందం రంగం లోకి దింపినట్టు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ సినిమా కు హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని అదిరిపోయే కమర్షియల్ మూవీ గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: