అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ కి పాపులర్ అయిన హీరోయిన్ షాలిని పాండే. తెలుగులో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ గా మారుతుంది అని అందరూ భావించారు కానీ ఈమెకి అనుకోని ఈ విధంగా ఆఫర్లు రాకపోవడంతో పెద్దగా ఈమె ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక ఈమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే పరిస్థితి కూడా లేదు అయినా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది షాలిని పాండే.


విజయ్ దేవరకొండ తో నటించిన హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ షాలిని పాండే కి మాత్రం అసలు ఏ సినిమా కూడా కలిసిరాలేదని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి చిత్రం లో ఎంత క్యూట్ గా కనిపించిన ఈమె ఆ తర్వాత సన్నబడడం తో ఈమె గ్లామర్ ,అందం పోవడంతో అటు నెటిజన్ల, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ మధ్య బరువు తగ్గి కనిపించిన కూడా ఈమెకు అవకాశాలు వస్తాయి ఏమో అనుకొని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. కానీ ఇప్పుడు మరింత బరువు తగ్గి సరికొత్త లుక్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతూనే ఉన్నారు.ఈమె లుక్ చూసిన నెటిజెన్స్ ప్రశంసలకు కంటే విమర్శలే చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎంతో బొద్దుగా కనిపించిన షాలిని ఇలా అయింది ఏంటి అంటూ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈమె మరీ సన్నబడడం తో ఈమే ముఖంలో కళ తప్పింది అన్నట్లుగా తమ అభిమానులే సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాదు ఇతర సినిమాల్లో కూడా నటించి మెప్పించింది కానీ ఇప్పుడు ఆమె పూర్తి సన్నబడడం తో వచ్చే ఆఫర్లు కూడా రాకుండా పోతున్నాయి అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. షాలిని గతంలోని బాగుండేదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: