నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమా కావడంతో , ఈ సినిమా ప్రస్తుతం ఎన్ బి కె 107 అనే వర్కింగ్  టైటిల్ తో షూటింగ్ ని జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూండగా, దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో,  వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో ఈ మూవీలో కనిపించబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. బాలకృష్ణ,  అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టోరీ మొత్తం ఓకే అవగా ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు మరో  యంగ్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.  ఆ యంగ్ హీరో పాత్రకు చిత్ర బృందం నవీన్ పోలిశెట్టి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  నవీన్ పోలిశెట్టి ఇప్పటికే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు  సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు.  

ప్రస్తుతం కూడా నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలలో నటిస్తున్నాడు.  ఆ సినిమాలతో పాటు బాలకృష్ణ 108 వ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నవీన్ పోలిశెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది.  బాలకృష్ణ 108 వ సినిమాలు నవీన్ పోలిశెట్టి పాత్ర చాలా కీలకం అని,  ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి పాత్ర చాలా సరదాగా , ఫన్నీగా ఉంటుంది అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఎఫ్ 3 మూవీ విడుదల  అయిన తర్వాత అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: