నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే రాజసం ఉట్టిపడుతుంది. ఇక ఆయనకు రేసింగ్ కార్లు అంటే యమ మోజు.విదేశాల్లో అయితే ఆయన సూపర్ స్పీడుతో కార్లు నడుపుతారట. ఈ సంగతి ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.అయితే బాల కృష్ణ దగ్గర చక్కటి కార్ కలెక్షన్ ఉంది. అందులో ఇటీవల చేరిన బెంట్లీ కాంటినెంటల్ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి దాని ఫీచర్లు ధర సంగతి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.బాల కృష్ణ వాడుతున్న ఈ బెంట్లీ కాంటినెంటల్ GT లగ్జరీ కారు ధర రూ.3.30 కోట్ల నుండి రూ.4 కోట్ల దాకా ఉంది. ఇక ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం 3.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ స్పీడ్ ని అందుకుంటుంది.అలాగే దీని గరిష్ట వేగం వచ్చేసి గంటకు 329 కి.మీ. కాంటినెంటల్ GT 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లు కూడా ఆటోమేటిక్ గా పనిచేస్తాయి.బెంట్లీ కాంటినెంటల్ GT కార్ శక్తివంతమైన ఇంజన్ తో వస్తుంది. దీనికి 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 8 పెట్రోల్ ఇంజన్ ని అందించారు. ఈ ఇంజిన్ 542 బిహెచ్‌పి (550 పిఎస్) శక్తిని ఇంకా 568 (770 ఎన్ఎమ్) టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ కారు ముందు, వెనుక భాగంలోని కొత్త డిజైన్ ను అనుసరిస్తాయి.
ఇక ఇది కారు విలాసవంతమైనదిగా కనిపించేలా చేస్తాయి. ఈ కొత్త బెంట్లీ కారు ఫస్ట్ టైం డార్క్ టింట్ డైమండ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్‌తో వస్తుంది.ఇక కారు లోపలి భాగంలో కొత్త స్టైలిష్ సీట్లు అందించారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వెనుక సీట్ వద్ద పెద్ద లెగ్‌రూమ్‌ అనేది వస్తుంది. ఈ కారులోని ఫీచర్స్ గురించి మాట్లాడితే 10.9-అంగుళాల స్క్రీన్‌తో నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సూపర్ హై-రిజల్యూషన్ గ్రాఫిక్స్ ఇంకా అలాగే మెరుగైన కనెక్టివిటీని  కూడా అందిస్తుంది. అలాగే వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే ఇప్పుడు ఈ కారులో స్టాండర్డ్ వస్తుంది. ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఆటో కూడా అందించారు. ఇక నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులు అలరిస్తున్నారు. రీసెంట్ గా అఖండ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, అటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షో హోస్ట్ గా ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ చేసుకొని, తాజాగా గోపీచంద్ మలినేని సినిమా NBK 107 షూటింగులో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: