ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా పాన్ ఇండియా సినిమా మాట వస్తే మన తెలుగు సినిమాలే అందులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన తెలుగు నుంచి ఒక్కో భారీ సినిమా టోటల్ పాన్ ఇండియన్ వైడ్ ఓ రేంజ్ లో రీచ్ తో దుమ్ము లేపుతున్నాయి.అయితే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా కానీ ఆడియెన్స్ ని ఫిదా చెయ్యాల్సింది మాత్రం కేవలం హీరోనే.ఇక ఈమధ్య కాలంలో పాన్ ఇండియా లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సత్తా చూపిస్తున్నాడు.రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్(RRR) సినిమాతో ఏమో కాని ఇప్పుడు రాబోతున్న తన 30వ సినిమా కొరటాల శివతో ప్లాన్ చేసిన దానితో అయితే కుంభస్థలం బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు యంగ్ టైగర్. నిన్న మేకర్స్ ఎన్టీఆర్30 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మాస్ వీడియో ని విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో కొన్ని మోషన్స్ తో కేవలం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాత్రమే ఉంది.


ఇక తెలుగులో అయితే ఎలాగోలా మంచి సాలీడ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక ఇది అందరికీ తెలిసిందే.కానీ హిందీ వెర్షన్ లో వస్తున్న రెస్పాన్స్ మాత్రం అసలు ఊహించనిది అని చెప్పాలి. హిందీలో ఆడియెన్స్ ఎన్టీఆర్ హిందీ మాటల మాస్ విశ్వ రూపానికి ఇంకా అతని డైలాగ్ డెలివరీని విని ఫుల్ ఫిదా అయ్యిపోయారు. అక్కడ చాలా మంది హిందీ స్టార్స్ కూడా చెప్పలేని విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ చాలా అద్భుతంగా ఉందని ఇంకా తమ అభిమాన హీరో షారుఖ్ తర్వాత అంతా పవర్ ఫుల్ గా హిందీలో డైలాగ్ చెప్పింది కేవలం మన ఎన్టీఆర్ అని అంతా కూడా ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు.మొత్తానికి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ జస్ట్ తన వాయిస్ తోనే నార్త్ ఆడియెన్స్ అటెన్షన్ ని తెచ్చేసుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదల నాటికి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: