ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భం గా ఆయన చేయబోయే సినిమాల యొక్క అధికారిక ప్రకటనలు నేడు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం కొరటాల శివ దర్శకత్వం లో ఆయన చేయబోయే సినిమాకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అందులో ఒక డైలాగ్ సినిమాపై అంచనాలను భారీ స్థాయి లో పెంచి సినిమా ను ఓపెన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.

మరొకవైపు ఆచార్య సినిమాతో కొరటాల శివ తొలి పరాజయాన్ని అందుకోగా ఈ సినిమా తప్పకుం డా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అని అభిమానులు చెబుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతాగ్యారేజ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా దానికి మించిన విజయాన్ని అందుకుంటుందని చెబుతున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఇకపోతే ఈ రోజు ఎన్టీఆర్ 31వ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్సినిమా చేస్తున్నాడని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లేదు అని కొంత మంది చెప్పగా ఇప్పుడు అధికారిక ప్రకటన రావడం ఈ సినిమా ఉందని చెప్పడానికి గట్టి సాక్ష్యం అయిం ది. ఆ విధంగా ఎన్టీఆర్ అభిమానులు భారీ స్థాయిలో ఈ పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్నారు అని చెప్పాలి. భవిష్యత్తులో ఏ విధంగా ఎన్టీఆర్ తన పాన్ ఇండియా ఇమే జ్ ను మలుచుకుంటాడో చూడాలి. ఇక పోతే  కొరటాల శివ ఈ కథను ఎంతో బాగా ప్రెజెంట్ చేయడం వల్లే ఎన్టీఆర్ ఈ స్థితిలో కూడా ఆయన సినిమా ను ఓకే చేశాడని కూడా చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: