ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రంపై కన్నడ ప్రేక్షకులు మొదటి నుంచి భారీ స్థాయిలో అసహనం గా ఉన్నారు. కారణం ఏదైనా కానీ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన విషయం లో ఒక ప్రాంతం వారు నెగిటివ్ గా ఉండటం నిజంగా ఆ సినిమాపై భారీ ప్రభావం పడుతుంది. వాస్తవానికి తెలుగు సినిమాలకు కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ టాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలకు మంచి వసూళ్లు వస్తూ ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో కర్ణాటక ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాలు కూడా మంచి ఫలితాలను అందుకుంటూ ఉంటాయి.  ఆ విధంగా ఇరు చిత్ర పరిశ్రమలలోని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమ తో పోలిస్తే శాండిల్ వుడ్ సినిమా పరిశ్రమ చాలా చిన్నది. అలాంటి చిత్ర పరిశ్రమ నుంచి కేజీఎఫ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. దాంతో తమ ప్రాంతానికి ఎంతో పెరొచ్చేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ను అందరూ ఎంతో పొగిడారు.

అయితే అంత పెద్ద సినిమాలు చిత్రీకరించిన ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా ని కూడా కన్నడ హీరోలతోనే చేయాలని అందరూ ఆశించారు. కానీ వారికి భిన్నంగా ఆలోచించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేయడం వారికి మింగుడు పడలేదు. దాంతో ఈ చిత్రం పట్ల వారు మొదటి నుంచి కోపం గా ఉన్నారు. దానికి తోడు ఈ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే చేస్తూ కన్నడలో చేయడం లేదనే వార్తలు రావడం వారికి మరింత కోపాన్ని తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి వారిని శాంతింప చేయడానికి యూనిట్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా చిత్రీకరణ మాత్రం అన్ని భాషల్లో చేస్తే పాజిటివ్ టాక్ ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మిగతా భాగం యొక్క షూటింగ్ జరుపుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: