కరోనా పుణ్యమా అని ఓటీటీ వేదికలు వెలుగులోకి వచ్చాయి. నిజం చెప్పాలంటే కరోనా ముందు వరకు కూడా చాలామందికి ఓ టి టి ఫ్లాట్ ఫామ్ అన్నది ఒకటి ఉందని తెలియదు, అలాంటి సమయంలో అందరూ ఇంటికి అతుక్కుపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం అంతా కూడా టెలివిజన్ కు అతుక్కుపోయారు, ఇదే సమయంలో ఓ టి టి వేదికల వైపు కూడా అట్రాక్ట్ అయ్యి బాగా అలవాటు పడ్డారు. దీంతో అనూహ్యంగా పోటీ యూజర్లు రికార్డు స్థాయిలో గణనీయంగా పెరగడం జరిగింది ముఖ్యంగా యూత్ ఓటీటీ కంటెంట్ లకు అడిక్ట్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఓ టి టి లు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా తమ సబ్స్ స్క్రైబర్స్ దోచుకొనే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలో తమ ప్రణాళికలను అమలు చేశాయి... ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన ‘ఆర్ ఆర్ ఆర్’ ,కేజీఎఫ్ 2 చిత్రాల స్ట్రీమింగ్ ను ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి సంస్థలు ఈ సినిమాలతో పే పర్ వ్యూ అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఏడాదికి రూ.699 సబ్స్ స్క్రిప్షన్ ను కట్టించుకుంటున్న జీ5 తన ఓ టి టి వేదికపై జక్కన్న అద్భుత సృష్టి అయిన ఆర్ ఆర్ ఆర్ ని చూడాలంటే అదనంగా  నగదు చెల్లించాల్సిందే అంటూ షాకిచ్చింది. ఇదే తరహాలో అమెజాన్ ప్రైమ్ కూడా యాజర్లను టార్గెట్ చేసింది.. ఏడాదికి రూ .14499 రూపాయలు కట్టించుకుంటున్న ఈ ప్రముఖ ఓటీటీ సంస్థ ఇపుడు ‘కేజీఎఫ్ 2’ కోసం రూ. 199 కట్టాల్సిందే అంటూ అధికారకంగా ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది.

దీంతో విసుగు చెందిన సబ్స్క్రైబర్లు సోషల్ మీడియా వేదికగా సదరు ఓటిటి సంస్థలను హెచ్చరిస్తున్నారు.  సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ భయంకరంగా ట్రోల్స్ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే... ఈ సంస్థలు ఏదో సాధించాలని అనుకుని ప్రవేశ పెట్టిన పే పర్ వ్యూ ఫార్ములా దారుణంగా నిరాశ పరిచినట్లు సమాచారం. అంతేకాకుండా  ఓటీటీలో రిలీజ్ అవుతున్న  చిత్రాలు సైతం క్షణాల్లో టొరెంట్ లలో అందుబాటులోకి వస్తుండడంతో ఓ టి టి లకు అంతా డబ్బులు చెల్లించి చూడటం అవసరమా అనుకుంటున్నారు.  ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో మళ్లీ ఓ టి టి ల పరిస్థితి మునుపటిలా తయారయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: