సౌత్ ఇండియన్ చిత్రాలు తమ జోరుతో బాక్స్ ఆఫీస్ ను హోరెత్తిస్తున్నాయి. విడుదల అయిన ప్రతి భాషలోనూ సత్తా చాటుతూ దక్షిణాది చిత్రాల హవాను కొనసాగిస్తున్నాయి. ఇటీవల విడుదల అయిన కేజీఎఫ్ సినిమా గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ మూవీ కలెక్షన్ల సునామి ఇప్పట్లో తగ్గేలా లేదు. రిలీజ్ అయి 35 రోజులు అవుతోంది, అప్పుడే పన్నెండు వందల కోట్ల వసూళ్లను రాబట్టేసి రికార్డ్ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా చూస్తుంటే బాహుబలి, దబాంగ్ వంటి చిత్రాల తరవాత స్థానంలో ఉంది. కాగా ఒకవైపు ఓ టి టి లో స్ట్రీమ్ అవుతున్నప్పటికీ థియేటర్ల వద్ద మాత్రం కేజీఎఫ్ సినిమా చూసేందుకు క్యూలు కడుతూనే ఉన్నారు.

ఇప్పటికీ పలు చోట్ల రెగ్యులర్ గా హౌజ్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే బాహుబలి రికార్డులను కూడా కేజీఎఫ్ చిత్రం బ్రేక్ చేసి అగ్ర స్థానంలో నిలిచేలా కనిపిస్తోంది. తమ అభిమాన హీరో యశ్ చిత్రం ఈ స్థాయిలో ఆదరణ పొందుతుండటంతో ఫ్యాన్స్ సంతోషంతో ఉరకలు వేస్తున్నారు. ఈ సినిమాలో తమ హీరో చెప్పిన డైలాగ్ ను గుర్తుచేసుకుంటూ కరెక్ట్ గా చెప్పావ్ బాస్ అంటున్నారు.  ఇంతకీ ఏమిటా డైలాగ్ అంటే... ఈ చిత్రం లో హీరో యశ్ ఒక సందర్భం లో నేను ఇండియా కి సిఇఒ ని అంటూ భారీ డైలాగ్ చెబుతాడు. కాగా ఇపుడు ఈ సినిమా కురిపిస్తున్న కాసుల వర్షం చూసిన ప్రేక్షకులు మీరు బాక్సాఫీస్‌ సీఈవో రాఖీ బాయ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఊహించిన దానికంటే భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం శరవేగంగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్‌ను దాటేయగా వరల్డ్ వైడ్‌గా చూస్తే పన్నెండు వందల కోట్ల గ్రాస్ ను క్రాస్‌ చేసింది. .. ఇటీవల కొన్ని బాలీవుడ్ స్టార్ హీరోల  చిత్రాలు రిలీజయ్యాయి. అయినప్పటికీ 'కేజీయఫ్ 2' హిందీలో తగ్గేదేలే అన్నట్లుగా 430 కోట్లు రాబట్టడం విశేషం. ఇక కేజీఎఫ్ 3 కూడా వచ్చేస్తే ఇంతకు మించిన హైప్ క్రియేట్ చేయడం ఖాయం. ఇది ఇలాగె మరో వారం కొనసాగితే 1500 కోట్లు ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ టార్గెట్ చేరుకుంటుందా లేదా అన్నది చూడాలి.  ఈ సినిమాతో తన డైరెక్షన్ పవర్ ను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

మరింత సమాచారం తెలుసుకోండి: