మేకప్ లేకుండా హీరోయిన్ కనిపించడం చాలా అరుదు గా ఉంటుందని చెప్పవచ్చు.. అలాంటిది తమన్నా సహజంగా ఉండే సౌందర్యాన్ని చూసి ఒక్కసారి ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కామెంట్ రూపంలో తన అభిమానులు సైతం ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకవైపు కెరీర్ పరంగా బాగా జోరు మీద ఉంది తమన్నా. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కోన్ని సంవత్సరాలు అవుతోంది తమన్నా. ఇక గతంలో ఇన్ని ఏళ్లుగా కేవలం విజయశాంతి, సౌందర్య రమ్యకృష్ణ తదితర హీరోయిన్లే ఇన్ని ఏళ్ళపాటు ఇండస్ట్రీలో తిరుగులేకుండా ఉన్న నటులు గా చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం ఈ లిస్టులో తమన్నాను కూడా చేర్చవచ్చ అని అభిమానులు భావిస్తున్నారు. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లకు పైగా అవుతున్నట్లుగా సమాచారం. అయినప్పటికీ కూడా ఆమె పాపులారిటీ అసలు ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా ఉంటూ పలువురు స్టార్ హీరోలతో నటించి తమన్నా తన అందం గ్లామర్తో యువ హీరోయిన్లకి కాంపిటీషన్ గా నిలిచింది. 
చక్కని నటన అంతకుమించి గ్లామర్తో అవకాశాలను సంపాదించుకుంటోంది.2019 లో విడుదలైన f-2 ఈ చిత్రంతో తమన్నా, మెహ్రిన్ ఇద్దరు కూడా  సెమీ  బికినీలో కనిపించారు. ఇక ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు నడుస్తూ వెళుతూ ఉంటే తమన్నా గ్లామర్ ముందర..మెహ్రిన్ పూర్తిగా డామినేట్ చేయలేకపోయింది.ఇక కెరీర్ మొదట్లో పద్ధతిగా ఫర్ఫార్మెన్స్ ఇస్తూ లేడి ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చింది తమన్నా. ఇక స్టార్ హీరోల చిత్రాలలో గ్లామర్ రోల్ పాత్రలు చేస్తూ స్టార్స్ గా అనేక హిట్ తన ఖాతాలో వేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించింది. అల్లుడు శీను, జై లవకుశ వంటి చిత్రాలతో పాటు ఇతర కన్నడ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్ లో నటించింది . తమన్నా ప్రస్తుతం తెలుగులో పాటు బాలీవుడ్, తమిళ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం f-3 సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: