బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంగనా రనౌత్ కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా సమాజంలో జరిగే అనేక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలా సమాజంలో జరిగే అనేక విషయాలపై తనదైన రీతిలో చాలా ఘాటుగా స్పందిస్తూ ఉండడంతో బాలీవుడ్ లో కంగనా రనౌత్ ను ఫైర్ బ్రాండ్  అనే పేరు తో  కూడా పిలుస్తూ ఉంటారు.  అలాగే కంగనా రనౌత్ ముక్కు సూటి గల వ్యక్తి.

ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ 'ధాకాడ్' మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు బాక్సాఫీస్ దగ్గర దక్కుతున్నాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఒక కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసింది. కంగనా రనౌత్ తాజాగా నటించిన  ధాకాడ్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కంగనా రనౌత్ తన కొత్త లగ్జరీ కారు తో దర్శనమిచ్చింది. కంపెనీ ప్రతినిధులు కంగనా రనౌత్ కు కార్ తాళాలను ఇచ్చారు.  

కంగనా రనౌత్ తాజాగా కొనుగోలు చేసిన లగ్జరీ కారు ధర ఐదు కోట్లు. కంగనా రనౌత్ తాజాగా కొనుగోలు చేసిన లగ్జరీ కార్  మెర్సిడెస్ మేబాక్  ఎస్ 680 మోడల్ కార్.  ప్రస్తుతం కంగనా రనౌత్ ఈ లగ్జరీ కార్ తో దిగిన ఫోటో  నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. ధాకాడ్ మూవీ ప్రీమియర్ షో కు కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కంగనా రనౌత్ తెలుగులో కూడా ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: