మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో  హీరోగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా  దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభించిన రామ్ చరణ్,  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత రామ్ చరణ్ 'జెర్సీ' సినిమాతో  ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. 

గౌతమ్ తిన్ననూరి సినిమా తర్వాత  రామ్ చరణ్ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నట్లు సమాచారం.  లోకేష్ కనకరాజు ఇప్పటికే మానగరం, ఖైదీ , మాస్టర్ సినిమాల విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. పరచటం లోకేష్ కనకరాజు,  కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా జూన్ 3 వ తేదిన విడుదల కాబోతుంది. విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు,  అజిత్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత  రామ్ చరణ్,  లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: