తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్ హీరోగా పేరు పొందారు రాజశేఖర్. తాజాగా శేఖర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాకి దర్శకురాలిగా తన భార్య జీవిత దర్శకత్వం వహించింది. ఇక ఈ సినిమానే త్రిపుర క్రియేషన్ పతాకంపై శివాని రాజశేఖర్ సుధాకర్ రెడ్డి, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందు విడుదల అవ్వడం జరిగింది. దీంతో ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకున్న ట్లు గా తెలుస్తోంది. అయితే ట్రైలర్, టీజర్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ బిజినెస్ పరంగా అనుకున్న స్థాయిలో జరగలేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

1). నైజాం- రూ. 1.20 కోట్లు
2). సీడెడ్-రూ.50 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-రూ.60 లక్షలు.
4). ఈస్ట్-రూ.15 లక్షలు.
5). వెస్ట్- రూ.12 లక్షలు.
6). గుంటూరు- రూ.20 లక్షలు
7). కృష్ణ- రూ. 13 లక్షలు.
8). నెల్లూరు- రూ. 20 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..3.10 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
10). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్- రూ.15 లక్షలు
11). ప్రపంచవ్యాప్తంగా టోటల్ బిజినెస్ విషయానికి వస్తే..3.25 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.

ఇక శేఖర్ చిత్రం కేవలం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.3.25 జరగగా చాలా ఏరియాలలో ఈ చిత్రాన్ని ఓన్ గా రిలీజ్ చేస్తున్నారని నిర్మాతలు. ఇక ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపుగా రూ.3.5 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 300 థియేటర్లకు పైగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్సినిమా తో బయట పడతారా లేదా అన్న విషయం ఈరోజు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజశేఖర్సినిమా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: