టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనగానే మెగా స్టార్ చిరంజీవి నే. అంతగా ఆ తరం నుండి ఈ తరం వరకు కూడా అగ్ర హీరోగా రాణిస్తూ ఇప్పటికీ అంతే ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. నవరసాలను అవలీలగా పండించగల ఈ నటుడు కి ఒక పెద్ద అభిమాన సైన్యమే ఉంది. టాలీవుడ్ అత్యదిక అభిమానులు సొంతం చేసుకున్న హీరోగా చిరు కి పేరుంది. మాస్ అయినా క్లాస్ అయినా కామెడీ అయినా లేక రఫ్ అండ్ టఫ్ అయినా ఎందులో అయినా ఒదిగిపోగల ఈ నటుడికి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానులుగా మారిపోయారు. ఒక హీరో మహా అయితే మాస్ ఫ్యాన్స్ ని లేదా ఫ్యామిలీ ఆడియన్స్ లేక యాక్షన్ లవర్స్ ని ఇలా ఒకటి లేక రెండు జోనర్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటారు.

అయితే మన చిరు మాత్రం అన్ని వర్గాల సినీ లవర్స్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు. అయితే ఇంతటి ఫ్యాన్  ఫాలోయింగ్, ఇండస్ట్రీలో గొప్ప స్థాయి అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మొదట్లో పలు సినిమాల్లో విలన్ గా నటించారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి ఎంతో కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ అగ్ర స్థాయికి చేసుకున్నారు చిరు. అయితే ఇలా చిరు ఎదగడానికి ప్రతిభ ఉన్నా అందుకు ప్రోత్సాహం , అవకాశాలు మాత్రం అల్లూరు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ గారిని చేసుకున్నాకే వచ్చాయని కొందరు అంటుంటారు.  అయితే ఇందులో ఎంత నిజం ఉంది అంటే...

అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయ్యాక మరింత స్టేటస్ పెరిగింది అని చెప్పొచ్చు. కానీ కేవలం ఆయన వల్లనే మెగాస్టార్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అంటే మాత్రం అది పూర్తిగా పొరపాటే. 1980 లో చిరంజీవి - సురేఖ గార్ల వివాహం జరిగింది. అప్పటికే చిరు 10 సినిమాలకు పైగా  నటించారు.  చిరంజీవి ఒక సంవత్సరం లో 14 సినిమాలు చేసిన దాఖలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలియక పోవచ్చు. ఒక హీరో రోజుకు ఎన్ని షిఫ్టులు చేస్తే అది సాధ్యం అవుతుంది అన్నది తెలిసిందే. మరి ఎంత ప్యాషన్ ఉంటే ఎంత నిబద్దత ఉంటే ఆ స్థాయిలో కష్టపడతారు....ఆయన క్రమశిక్షణ, సినిమాపై పిచ్చి ప్రేమ వలనే చిరు అనతి కాలంలోనే అగ్ర స్థానానికి చేరుకున్నారు. కేవలం అల్లు రామలింగయ్య ప్రోత్సాహం అన్ని సినిమాలు చిరంజీవికి వచ్చాయి అంటే నమ్మశక్యంగా అనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: