పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.  ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి , మళ్ళీ తిరిగి వకిల్ సబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 50 శాతం వరకు పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగు ప్రారంభం అయ్యింది.  ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.  

అలాగే ఆగస్టు నెల చివరి వరకు మొదటి షెడ్యూలు షూటింగ్ కూడా కంప్లీట్ చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.  హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను జూలై నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా కోసం హైదరాబాద్ లో పలు చోట్ల ప్రత్యేకమైన సెట్ లను వేయనున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఇది వరకే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు,  సినీ ప్రముఖులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: