నాచురల్ స్టార్ నాని కొన్ని రోజుల క్రితం విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.  ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించాడు. శ్యామ్ సింగరాయ్  సినిమా తర్వాత నాని హీరోగా నటిస్తున్న సినిమా కావడం , మెంటల్ మదిలో,  బ్రోచేవారెవరురా లాంటి రెండు వరుస విజయాల తరువాత వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంటే సుందరానికి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇలా భారీ అంచనాలు కలిగి వున్న ఈ సినిమా నుండి ఇప్పటికే చిత్ర బృందం టీజర్ మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  అంటే సుందరానికి సినిమాలో  నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా అంటే సుందరానికి సినిమా నుండి చిత్ర బృందం ఒక క్రేజీ అప్ డేట్ ను విడుదల చేసింది.  

తాజాగా అంటే సుందరానికి చిత్ర బృందం ఈ సినిమా నుండి మరో లిరికల్ వీడియో సాంగ్  విడుదల తేదీని తాజాగా ప్రకటించింది.  రాంగో రంగా అనే లిరికల్ సాంగ్ ను మే 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  ఇది ఇలా ఉంటే  అంటే సుందరానికి సినిమాను జూన్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.  నాచురల్ స్టార్ నాని ఈ సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.  దసరా సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: