టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే.  సోగ్గాడే చిన్ని నాయనా మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కించారు.  బంగార్రాజు సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా బంగార్రాజు మూవీ కి కూడా కళ్యాణ్ కృష్ణ  దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా,  నాగ చైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటించింది.  2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని లాంగ్ బాక్సాఫీస్ రన్ లో క్లీన్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకున్న బంగార్రాజు సినిమా ఆ తర్వాత 'ఓ టి టి' లో కూడా విడుదల అయ్యి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.  ఇలా థియేటర్లలో క్లీన్ హిట్ గా నిలిచి,   'ఓ టి టి' ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్న బంగార్రాజు సినిమా కొన్ని రోజుల క్రితం మొదటి సారి జీ తెలుగు లో ప్రసారం అయినప్పుడు 14 దాకా 'టి ఆర్ పి' ని సొంతం చేసుకుంది.  

ఇలా మొదటి సారి బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు దుమ్ముదులిపిన బంగార్రాజు సినిమా తాజాగా రెండవ సారి కూడా బుల్లితెరపై ప్రసారం అయ్యింది.  రెండవ సారి బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు బంగార్రాజు సినిమా 4.71 'టి ఆర్ పి' ని సొంతం చేసుకుంది.  రెండవ సారి కూడా బంగార్రాజు సినిమా బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు బాగానే 'టి ఆర్ పి' రేటింగ్ ను సంపాదించుకుంది.  ఇలా థియేటర్లలోకి క్లీన్ హిట్ గా నిలిచి,  'ఓ టి టి'  ప్రేక్షకులను అలరించి,  ఇప్పుడు బంగార్రాజు సినిమా బుల్లితెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: