మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా కూడా ఈయన తన సొంత నటన, టాలెంట్ తో పాపులర్ అయ్యాడు.ఒక్కో సినిమా తో ఒక్కో విధమైన టాక్ ను అందుకున్నాడు..అతను నటించిన అన్నీ సినిమాలు బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ ను అందుకున్నాయి..గద్దల కొండ గణేష్ సినిమా ఘన విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే..ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఎఫ్2.. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా టాలివుడ్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది..


ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తీ అయ్యింది.ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజిగా ఉన్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ తేజ్ తోపాటు..వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధానపాత్రలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు… ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ మొదలెట్టనున్నారు..



వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా.. ఈ సినిమా జూన్ నెలాఖరు నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వినూత్నమైన కథాంశంతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎక్కువ భాగం లండన్‏లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది..వినయ్ రాయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. జూన్ మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: